India vs Bangladesh 1st ODI Weather Forecast | ఆ స్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ పర్యటనలో వర్షంతో విసిగిపోయిన అభిమానులకు గుడ్ న్యూస్. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి వన్డేకు ఎలాంటి వర్షం ముప్పులేదు. భారత్ మాదిరి బంగ్లాదేశ్‌లో కూడా చలికాలం కావడంతో వర్షం వచ్చే సూచనల్లేవ్. మ్యాచ్ సజావుగా జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో వర్షం కారణంగా భారత్ రెండే రెండు పూర్తి స్థాయి మ్యాచ్‌లు ఆడింది. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ బంగ్లాదేశ్‌లో ఆ పరిస్థితి లేకపోవడం ఊరటనిచ్చే అంశం.
#INDvsBAN
#ViratKohli
#INDvsBANWeatherReport
#RohitSharma
#India
#Cricket